Ingland: చెన్నైలో తొలి టెస్ట్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్!

England Won the Toss and Elected to Bat in First Test
  • భారత జట్టులో నదీమ్, వాషింగ్టన్ లకు స్థానం
  • వృద్ధిమాన్ సాహా స్థానంలో కీపర్ గా రిషబ్ పంత్
  • డోమ్ బెస్ కు అవకాశం ఇచ్చిన ఇంగ్లండ్
ఇండియాలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా, నేటి నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలి రోజు పిచ్ పై ఉన్న గ్రాస్, బ్యాటింగ్ కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టులో నదీమ్, వాషింగ్టన్ సుందర్ లకు స్థానం లభించింది. ఆసీస్ లో రాణించిన మహమ్మద్ సిరాజ్ ను తీసుకోకపోవడం గమనార్హం. ఇక తుది జట్ల వివరాలు పరిశీలిస్తే,

ఇంగ్లండ్ జట్టు: డామ్ సిబ్లీ, రోరీ బుర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, జోస్ బట్లర్, డోమ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, షాహబాజ్ నదీమ్, ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా.
Ingland
India
Test
Cricket
Toss

More Telugu News