స్టయిలిష్ లుక్‌లో పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీ!

03-02-2021 Wed 17:55
  • ఎప్పుడూ పైజమాలో కనిపించే రాహుల్
  • టక్ చేసుకుని పార్లమెంటుకు వచ్చిన వైనం
  • రాహుల్ ను గుర్తు పట్టని సొంత పార్టీ ఎంపీలు
Rahul Gandhi in new look
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సరికొత్త లుక్ లో మెరిశారు. చాలా స్టయిలిష్ గా పార్లమెంటుకు వచ్చారు. రాహుల్ సాధారణంగా ఎప్పుడూ పైజామా వేసుకుని కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జీన్స్, టీషర్ట్ వేసుకుంటారు. కానీ తాజాగా ఫార్మల్ డ్రెస్ లో తళుక్కుమన్నారు. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో టక్ చేసుకుని పార్లమెంటుకు వచ్చారు. ట్యాబ్ పట్టుకుని, మాస్క్ వేసుకుని వస్తున్న ఆయనను తొలుత సొంత పార్టీ ఎంపీలే గుర్తు పట్టలేదు. ఆ తర్వాత రాహుల్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఇటీవలి కాలంలో రాహుల్ దూకుడు పెంచారు. జనాల్లోకి ఆయన విస్తృతంగా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని రెగ్యులర్ గా టార్గెట్ చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ఆయన యత్నిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు వెళ్లిన రాహుల్... అక్కడ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుల పుట్టగొడుగుల బిర్యానీ తయారీలో పాల్గొన్నారు. అక్కడ అందరితో పాటే భోజనం చేశారు. రాహుల్ గాంధీలో వచ్చిన మార్పును చూసి, కాంగ్రెస్ నేతలు సంతోషపడుతున్నారు. ఇది పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు.