Rajashekhar: కొత్త దర్శకుడితో రాజశేఖర్ కొత్త సినిమా

Rajashekhar to start his new film with new director
  • 'గరుడవేగ'తో హిట్ పొందిన రాజశేఖర్ 
  • 'జోసెఫ్' మలయాళ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్
  • లలిత్ అనే కొత్త దర్శకుడికి బాధ్యతలు    
ఆర్టిస్టుగా డా.రాజశేఖర్ కి టాలీవుడ్ లో ఓ ప్రత్యేకత వుంది. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్..  ఎమోషనల్ క్యారెక్టర్స్.. అంటే ఆయనే గుర్తొచ్చేవారు. అలాంటి పాత్రలపై తనదైన ముద్ర వేశారాయన. ఇప్పుడు యంగ్ హీరోల స్పీడులో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆయన సాగుతున్నారు.

ఈ క్రమంలో ఆమధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ చేసిన 'గరుడ వేగ' సినిమా మంచి హిట్టయింది. ఆ తరువాత 'కల్కి' సినిమాలో నటించారాయన. ఇప్పుడు మళ్లీ కొంత గ్యాప్ తరువాత మరో చిత్రాన్ని చేయడానికి రాజశేఖర్ ముందుకు వచ్చారు.

మలయాళంలో హిట్టయిన 'జోసెఫ్' సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి ఆయన సమాయత్తమవుతున్నారు. దీనికి లలిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మూలకథకు మార్పులు చేర్పులు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగును ప్రారంభిస్తారు.
Rajashekhar
Joseph
Lalith
Garudavega

More Telugu News