Vijay Sai Reddy: సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయిస్తున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Fires on Chandrababu
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో మొదలైన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని స్థితిలో ఏం చేయాలో తెలియని చంద్రబాబు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనదైన కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి?" అని అన్నారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News