Madagaskar: మడగాస్కర్ లో అతి చిన్న సరీసృపాన్ని కనుగొన్న పరిశోధకులు!

Worlds Smalest Chameleon is in Madagaskar
  • జర్మనీ, మలగాసే పరిశోధకుల ప్రయత్నం సఫలం
  • అర అంగుళం ఉన్న ఊసరవెల్లి గుర్తింపు
  • నెట్టింట వైరల్ అవుతున్న చిత్రాలు
ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపాన్ని జర్మనీ, మలగాసేకు చెందిన పరిశోధకుల బృందం మడగాస్కర్ అడవుల్లో గుర్తించింది. తోకతో కలిపి దీని పొడవు అర అంగుళం మాత్రమే ఉండటం గమనార్హం. ఇది ఊసరవెల్లి జాతికి చెందినదని, దీనికి 'బ్రూకీసియా నానా'గా పేరు పెట్టామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచంలో గుర్తించిన సరీసృపాల్లో ఇదే అతి చిన్నదని, ఇది మగ ఊసరవెల్లని పేర్కొన్నారు.

ఇక ఈ జాతిలో మగ ఊసరవెల్లితో పోలిస్తే, ఆడ ఊసరవెల్లి కొంచెం పొడుగా 29 మిల్లీ మీటర్లు ఉంటుందని తెలిపారు. వీటిని మైక్రో సిటీ స్కాన్, త్రీ డైమన్షనల్ ఎక్స్ రే సాయంతో పరిశీలించామని, ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. మడగాస్కర్ అడవుల్లో ఎన్నో అరుదైన ప్రాణులున్నాయని, ఇప్పటివరకూ 200కు పైగా జాతులను తాము కనుగొన్నామని తెలిపారు. ఇక, ఈ చిన్ని ఊసరవెల్లి చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Madagaskar
Chameleon
Smallest

More Telugu News