Monal Gajjar: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్పెషల్ సాంగు వార్తలపై మోనాల్ క్లారిటీ  
  • ఫ్యాన్సీ రేటుకి 'ఎఫ్ 3' డిజిటల్ హక్కులు
  • 'పుష్ప' రొమాంటిక్ సాంగుకి ప్లానింగ్    
Monal gives clarity on her special song

*  మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు ఇటీవల మీడియాలో బాగా వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని మోనాల్ తాజాగా వివరణ ఇచ్చింది. ఆ సినిమా నుంచి తనకు ఎటువంటి ఆఫర్ రాలేదని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఎఫ్ 3' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. కాగా, ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను జీ స్టూడియోకి ఫ్యాన్సీ రేటుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన 'వకీల్ సాబ్' డిజిటల్ హక్కులను కూడా దిల్ రాజు జీ స్టూడియోకే 15 కోట్లకు విక్రయించడం జరిగింది.
*  అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. దీని తర్వాత అల్లు అర్జున్, రష్మిక జంటపై ఓ రొమాంటిక్ సాంగును శ్రీశైలం అడవుల్లో సుందర దృశ్యాలలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News