Madanapalle: పోలీసుల రక్షణతో నామినేషన్ వేసిన వైసీపీ రెబెల్ అభ్యర్థిని పద్మావతమ్మ

  • మదనపల్లి సీటీఎం క్రాస్ రోడ్డు పంచాయతీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన పద్మావతమ్మ
  • 30 మందితో కలిసి కారును అడ్డుకున్న వైసీపీ నేత
  • ఆమెకు రక్షణ కల్పించిన ఎస్ఐ దిలీప్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకుంటున్న ఘటనలు పలుచోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, పద్మావతమ్మ అనే మహిళ సీటీఎం క్రాస్ రోడ్డు పంచాయతీ వైసీపీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. తన కారులో ఆమె వెళ్తుండగా స్థానిక వైసీపీ నేత మరో 30 మంది దుండగులతో కలిసి అడ్డుకున్నారు. ఆమె వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. దీంతో, ఆమె ఈ విషయాన్ని తన భర్తకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్ఐ దిలీప్ ఆమెకు రక్షణ కల్పించి నామినేషన్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె నామినేషన్ వేసి వెళ్లిపోయారు.
Madanapalle
Padmavatamma
Attack

More Telugu News