Atchannaidu: అచ్చెన్నాయుడికి రెండు వారాల రిమాండ్... జిల్లా జైలుకు తరలింపు

Two weeks remand for AP TDP President Atchannaidu
  • ఈ ఉదయం నిమ్మాడలో అచ్చెన్న అరెస్ట్
  • సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు
  • కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • ఈ నెల 15 వరకు రిమాండ్
ఇటీవలే ఈఎస్ఐ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి జైలు పాలయ్యారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

అచ్చెన్నను పోలీసులు కోటబొమ్మాళి సెషన్స్ కోర్టులో హాజరు పర్చగా, ఆయనకు న్యాయమూర్తి రెండు వారాల పాటు అంటే ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు అచ్చెన్నాయుడిని అంపోలు లోని జిల్లా జైలుకు తరలించారు. అటు, అచ్చెన్నాయుడి అరెస్ట్, ఇటు పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి ఘటనతో టీడీపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది.
Atchannaidu
Remand
Nimmada
Police
Telugudesam
YSRCP
Gram Panchayat Elections
Andhra Pradesh

More Telugu News