Bhavya Lal: నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా భవ్యా లాల్!

  • ఉత్తర్వులు వెలువరించిన శ్వేత సౌధం
  • స్పేస్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన భవ్య
  • గతంలో ఎస్టీపీఐ అనాలిసిస్ గానూ విధులు
Biden Choosen Bhavya Lal as NASA Acting Chief

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా భారత అమెరికన్ భవ్యా లాల్ ను నియమిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. భవ్యా లాల్ ఇప్పటికే ట్రంప్ నుంచి బైడెన్ కు అధ్యక్ష బాధ్యతల మార్పిడి టీమ్ లో పనిచేశారు. ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ విద్యను అభ్యసించిన ఆమె, 2005 నుంచి 2020 మధ్య ఎస్టీపీఐ (డిఫెన్స్ అనాలిసిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇనిస్టిట్యూట్)లో మెంబర్ గా విధులను నిర్వహించారు.

స్పేస్ టెక్నాలజీ, వివిధ దేశాలతో అంతరిక్ష సంబంధ వ్యూహాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, నేషనల్ స్పేస్ కౌన్సిల్, రక్షణ విభాగం, ఇంటెలిజెన్స్ విభాగాల్లో వైట్ హౌస్ ఆమె సేవలను అందుకుంటుందని బైడెన్ టీమ్ పేర్కొంది. ఆమె ఐదు జాతీయ స్థాయి సైన్స్ కమిటీల్లో పనిచేసిన అనుభవంతో నాసా విషయంలో భవిష్యత్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై బైడెన్ కు సలహాలు, సూచనలు అందించనున్నారని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.

భవ్యా లాల్ గతంలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్మియర్ అడ్మినిస్ట్రేషన్ ఫెడరల్ సలహా కమిటీలో పనిచేస్తూ, వాణిజ్యపరంగా రిమోట్ సెన్సింగ్ విభాగంలో సలహాలు అందించారు. నాసా తీసుకునే తాజా నిర్ణయాల వెనుకా ఆమె సలహాలు ఉన్నాయి. ఇప్పటికే నాసా సలహాదారుల బృందంలో ఉన్న ఆమె, ఇకపై యాక్టింగ్ చీఫ్ గా పనిచేస్తారని వైట్ హౌస్ వెల్లడించింది.

More Telugu News