Mamata Banerjee: వనరులను ప్రైవేటుకు అప్పగించడమేనా దేశభక్తి అంటే?: మమతా బెనర్జీ

  • పేదలను మోసం చేసేలా బడ్జెట్
  • ఎల్ఐసీ, రైల్వేలను ప్రైవేటు పరం చేస్తున్నారు
  • అవినీతి నేతలను ఢిల్లీ రప్పించేందుకు ప్రభుత్వం వద్ద పుష్కలంగా డబ్బు
Mamata Banerjee Criticize on Union Budget

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. దేశభక్తి గురించి గొంతు చించుకునే బీజేపీ.. దేశంలోని వనరులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని, ఇదెక్కడి దేశభక్తి అని ప్రశ్నించారు. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సహా రైల్వేను కూడా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, పేదల్ని మోసం చేసేలా ఉందని ఆరోపించారు.

కరోనా సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం వద్ద లేని డబ్బులు పార్టీలోకి వలస వచ్చే అవినీతి నాయకులను ఢిల్లీ రప్పించేందుకు మాత్రం ఉన్నాయని ఆరోపించారు. బీజేపీలో చేరేందుకు నలుగురు టీఎంసీ నేతలు ఇటీవల ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడాన్ని ఉద్దేశించి మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News