Gold: కడప జిల్లాలో రూ. కోటి విలువైన బంగారం పట్టివేత

  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు
  • కడప-తాడిపత్రి రహదారిపై కారులో సోదాలు
  • 2.7 కిలోల బంగారం లభ్యం
  • డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
One crore worth gold seized in Kadapa district

కడప జిల్లాలో ఇవాళ ఓ కారులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు కడప-తాడిపత్రి రహదారిపై ముద్దనూరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందుల నుంచి వస్తున్న ఓ కారును పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. ఆ కారులో లభ్యమైన 2.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.05 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారం ఆభరణాల రూపంలో ఉంది. సరైన బిల్లులు చూపించకపోవడంతో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ షఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నగలు పులివెందులలోని ఓ జ్యుయెలరీ షాపుకు చెందినవని, వాటిని మెరుగు పెట్టించేందుకు ప్రొద్దుటూరు తీసుకెళుతున్నట్టు పోలీసుల విచారణలో డ్రైవర్ షఫీ తెలిపాడు.

More Telugu News