Aamani: నేను గుండెపోటుకు గురయ్యానని ప్రచారం చేస్తున్నారు: నటి ఆమని

Aamani condemns rumors about her health
  • మంచిర్యాలలో సినిమా షూటింగ్
  • ఆమని గుండెపోటుకు గురయ్యారంటూ ప్రచారం
  • అవన్నీ పుకార్లేనంటూ ఖండించిన ఆమని
  • ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురైనట్టు వెల్లడి
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల పట్ల సీనియర్ నటి ఆమని స్పందించారు. తాను గుండెపోటుకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని అన్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం మంచిర్యాల వెళ్లిన ఆమని అస్వస్థతకు గురైనట్టు కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని ఆమన స్పష్టం చేశారు. మంచిర్యాలలో అస్వస్థతకు గురైంది గుండెపోటుతో కాదని, అక్కడ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తనతో పాటు యూనిట్ సభ్యులంతా అస్వస్థతకు గురైనట్టు వెల్లడించారు. చికిత్స అనంతరం తాను కోలుకున్నానని, అంతేతప్ప తనకు ఎలాంటి గుండెపోటు రాలేదని అన్నారు. ఇలాంటి వార్తలు ఎలా వ్యాప్తి చేస్తారో అంటూ ఆమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Aamani
Actress
Rumors
Health
Tollywood

More Telugu News