Allu Arjun: మోతుగూడెంలో బన్నీ మేనియా... వీడియో ఇదిగో!

Huge crowd at Mothugudem to see their hero Allu Arjun
  • పుష్ప చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్
  • సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
  • మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్
  • మోతుగూడెం వద్ద భారీగా తరలివచ్చిన అభిమానులు
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లర్ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. కాగా, పుష్ప తాజా షెడ్యూల్ ప్రస్తుతం మారేడుమిల్లి వద్ద జరుగుతోంది. షూటింగ్ అనంతరం బస చేసేందుకు వెళుతుండగా మోతుగూడెం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ రాత్రివేళ అయినప్పటికీ తన కారవాన్ నుంచి వెలుపలికి వచ్చాడు. అభిమానులందరికీ అభివాదం చేస్తూ వారికి సంతోషం కలిగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీని ఫొటోలు తీసేందుకు అభిమానుల పోటీలుపడ్డారు.
Allu Arjun
Mothugudem
Fans
Pushpa
Tollywood

More Telugu News