Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్... భారీ లాభాలతో పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు 

Stock Markets raise after Budge announcement
  • వార్షిక బడ్జెట్-2021 ప్రకటన
  • కేంద్రం పథకాలతో మదుపర్లలో ఉత్సాహం
  • 1,600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 400 పాయింట్ల మేర వృద్ధి నమోదు చేసిన నిఫ్టీ
  • బ్యాంకింగ్ షేర్లకు భారీ లాభాలు
కేంద్ర బడ్జెట్-2021 ప్రకటన భారత స్టాక్ మార్కెట్లలో మరింత ఊపు తెచ్చింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఊరట పథకాలు మదుపర్లలో కొత్త ఉత్సాహం తీసుకురాగా, మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి భారీ లాభాలతో దూసుకెళ్లాయి. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు ప్రకటించిన భారీ ప్యాకేజి (రూ.35 వేల కోట్లు), ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి... సూచీలను పైపైకి తీసుకెళ్లాయి.

బడ్జెట్ ప్రకటనతో సానుకూల సెంటిమెంట్లు బలపడ్డాయి. సెన్సెక్స్ 1,600 పాయింట్ల వృద్ధి నమోదు చేయగా, నిఫ్టీ కూడా అదే రీతిలో దూసుకుపోయింది. నిఫ్టీ 400 పాయింట్ల మేర లాభపడింది. ఇక కేంద్రం ప్రకటించిన నయా స్క్రాప్ విధానం ఆటోమొబైల్ రంగ షేర్లకు ఊతమిచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.
Stock Market
Union Budget 2021-22
Sensex
Nifty
India
Corona Virus
Pandemic

More Telugu News