Yash: సినిమా విడుదల రోజున సెలవు కావాలట: ప్రధానిని కోరుతున్న 'కేజీఎఫ్-2' ఫ్యాన్స్!

KGF Fans want National Holiday on July 16
  • జులై 16న విడుదల కానున్న 'కేజీఎఫ్-2'
  • ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
  • పరిశీలించమని ప్రధానిని కోరిన యశ్   
సూపర్ హిట్ అయిన 'కేజీఎఫ్'కు కొనసాగింపుగా, కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న 'కేజీఎఫ్-2' చిత్రం విడుదల రోజున జాతీయ సెలవు దినాన్ని ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ 'కేజీఫ్ చాప్టర్ 2 ఆన్ జులై 16' పేరిట హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న యశ్, "డియర్ నరేంద్ర మోదీ సార్, అభిమానుల ఎమోషన్ ను పరిశీలించి, జులై 16ను జాతీయ సెలవుదినంగా ప్రకటించండి" అని కోరారు. దీనికి కొన్ని ఎమోజీలను సైతం జోడిస్తూ, మోదీకి రాసిన లేఖను షేర్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, లాక్ డౌన్ సడలింపుల అనంతరం వస్తున్న తొలి అతిపెద్ద చిత్రంగా ఇది నిలువనుంది.
Yash
Leave KGF-Chapter 2
Narendra Modi
Twitter

More Telugu News