Vishnu Vardhan Reddy: ఇలాంటి అద్బుతాలను సృష్టించడం 'ఆత్మనిర్భర్ భారత్' కు నిదర్శనమని ప్రధాని చెప్పారు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy told PM mentions Bowen Pally Market in his Mann Ki Bath
  • 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ప్రసంగం
  • బోయిన్ పల్లి మార్కెట్ గురించి ప్రస్తావన
  • మార్కెట్లో రోజూ 10 వేల టన్నుల కూరగాయల వ్యర్థాలు
  • వ్యర్థాలతో విద్యుదుత్పత్తి, బయో ఇంధనం తయారు
  • ఆ విద్యుత్ ను మార్కెట్ అవసరాలకు వినియోగిస్తున్న వైనం
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. హైదరాబాదులోని బోయిన్ పల్లి మార్కెట్ లో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్న వైనాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాదులోని బోయిన్ పల్లి మార్కెట్ లో రోజూ 10 వేల టన్నుల వరకు కూరగాయలు వృథా అవుతున్నాయని, ఆ కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్, బయో ఇంధననాన్ని తయారుచేసి మార్కెట్ వినియోగానికి ఆ ఇంధనాన్ని వినియోగిస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ కొనియాడారని తెలిపారు. ఇలాంటి అద్భుతాలను సృష్టించడం 'ఆత్మనిర్భర్ భారత్' కు నిదర్శనమని మోదీ చెప్పినట్టు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, బోయిన్ పల్లి మార్కెట్ లో కేవలం వ్యర్థాల ద్వారానే నిత్యం 500 వాట్ల విద్యుచ్చక్తి, 30 కిలోల బయో ఇంధనం ఉత్పత్తి చేస్తున్నారు. మార్కెట్లో వెలుగులు పంచేందుకు ఆ విద్యుచ్చక్తిని వినియోగిస్తుండగా, బయో ఇంధనాన్ని మార్కెట్లోని క్యాంటీన్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు.
Vishnu Vardhan Reddy
Narendra Modi
Mann Ki Baat
Bowenpally Market
Hyderabad

More Telugu News