Tiger: తిరుపతి వ్యవసాయ కళాశాలలో పులి సంచారం

Tiger in Tirupati Agriculture College
  • తిరుపతి శివార్లలో మరోసారి పులి కలకలం
  • ఏజీ కాలేజీలో పులి తిరుగుతున్నట్టు గుర్తించిన స్థానికులు
  • పులి వెంట రెండు పిల్లలు
  • అటవీశాఖ అధికారులకు సమాచారం
తిరుపతి శేషాచల అడవులు అనేక వన్యప్రాణులకు ఆవాసాలు అని తెలిసిందే. అనేక పర్యాయాలు పులులు, ఎలుగుబంట్లు జనావాసాల్లో ప్రవేశించిన ఘటనలు నమోదయ్యాయి. తాజాగా తిరుపతి వ్యవసాయ కళాశాలలో పులి కలకలం రేగింది. ఓ పులి, తన రెండు పిల్లలతో కలిసి కళాశాల పరిసరాల్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. పులిని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

పులి సంచారంతో స్థానికులు హడలిపోతున్నారు. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెండు వారాల కిందట బాలాజీ నగర్ గ్యాస్ గోడౌన్ వద్ద ఓ చిరుత ఇదే రీతిలో తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ చిరుతపులి తిరిగి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
Tiger
Tirupati
Agriculture College

More Telugu News