Puvvada Ajay Kumar: ఆచార్య సెట్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవిని క‌లిసిన తెలంగాణ మంత్రి పువ్వాడ‌

puvvada shares pics of acharya sets
  • కోకాపేటలో  సినిమా షూటింగ్‌
  • చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి 
  • చిరంజీవితో దిగిన ఫొటోలు పోస్ట్
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైదరాబాద్ శివారులోని కోకాపేటలో జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆ షూటింగ్ లొకేష‌న్‌లోకి వెళ్లి చిరుని క‌లిశారు. చిరంజీవితో పాటు ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివను కలిసి, మాట్లాడారు.

ఈ విషయాన్ని పువ్వాడ త‌న‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అలాగే చిరంజీవితో కలసి దిగిన ఫొటోలను ఆయ‌న పోస్ట్ చేశారు. 'ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. మెగాస్టార్ చిరంజీవి  గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ..' అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

ఇక ఆచార్య‌ సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం పూర్త‌యింది. ఈ సినిమాను మే 13వ తేదీన విడుదల చేయ‌నున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్ తో పాటు పూజా హెగ్డే కూడా కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.
Puvvada Ajay Kumar
Telangana
Chiranjeevi
acharya

More Telugu News