Attack: రామమందిరం కోసం విరాళాలు సేకరిస్తున్న వారిపై బెంగళూరులో దాడి

Attack on workers who collects funds for Ram Mandir
  • అయోధ్యలో రామమందిరం నిర్మాణం
  • దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ
  • బెంగళూరులో బీజేపీ కార్యకర్తలపై దాడి
  • పోలీసులకు ఫిర్యాదు
అయోధ్యలో రామజన్మభూమి ప్రదేశంలో భారీస్థాయిలో రామమందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశవ్యాప్త విరాళాల సేకరణ ప్రారంభించింది. జనవరి 15 నుంచి ఊరూరా విరాళాల సేకరణ షురూ అయింది.

అయితే, ఇవాళ బెంగళూరులో రామమందిరం విరాళాలు సేకరిస్తున్న ముగ్గురు హిందుత్వ వాదులపై దాడి జరిగింది. నగరంలోని గురప్పణ పాల్య ప్రాంతంలో విరాళాలు వసూలు చేస్తూ, రాముడి పోస్టర్లు అతికిస్తుండగా తమపై దాడి జరిగిందని వారు తెలిపారు. తాము వాహనాలకు ఇంధనం నింపుకునే సమయంలో కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని వివరించారు.

దీనిపై దక్షిణ  బెంగళూరు బీజేపీ కార్యదర్శి వి.సుదర్శన్ మాట్లాడుతూ, స్థానికులు రావడంతో తమపై దాడికి అడ్డుకట్ట పడిందని తెలిపారు. ఈ దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని, ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కార్యకర్తలను బెదిరిస్తున్నారంటూ ఓ 50 మందిపై ఎఫ్ఐఆర్ రూపొందించారు.
Attack
Bengaluru
Ayodhya Ram Mandir
BJP

More Telugu News