డేట్ ఫిక్స్ చేసుకున్న వెంకీ 'నారప్ప'!
- తమిళ 'అసురన్'కి రీమేక్ గా 'నారప్ప'
- శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్
- చివరి షెడ్యూలులో చిత్రం షూటింగ్
- మే 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన
ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప' రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు ప్రకటన ఇచ్చింది. ఈ చిత్రాన్ని వేసవి సెలవులలో మే 14న థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నెలాఖరుతో మొత్తం పూర్తవుతుంది.
తమిళంలో హిట్టయిన 'అసురన్' చిత్రానికి రీమేక్ గా ఈ 'నారప్పను' నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి జంటగా నటిస్తోంది. కరోనా లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ అనంతపురం జిల్లాలో నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.