Mithun reddy: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిలపై కేసుల ఎత్తివేత

  • ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దాడి కేసు ఉపసంహరణ 
  • సదుం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసూ ఎత్తివేత
  • జీవోలో ప్రస్తావించని పేర్లు
Cases against YCP leaders Mithun Reddy and Chevireddy revoked

రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలపై గతంలో నమోదైన కేసును ప్రభుత్వం ఎత్తివేసింది. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ ఎస్.రాజశేఖర్‌పై దౌర్జన్యానికి పాల్పడడమే కాకుండా ఆయనను చెంపదెబ్బ కొట్టారన్న అభియోగంపై 2015లో ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. ఇప్పుడా కేసును ప్రభుత్వం ఎత్తివేసింది.

మిథున్‌రెడ్డిపై సదుం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే, కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె ఘటనలో నమోదైన మరో కేసును కూడా గతేడాది ప్రభుత్వం ఎత్తివేసింది. తాజాగా, మరో రెండు కేసులను  ఉపసంహరించుకోవడంతో ఆయనపై నమోదైన అన్ని కేసులు తొలగిపోయినట్టే.

 ఏర్పేడు కేసులను ఎత్తివేస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం అందులో నిందితులుగా ఉన్న మిథన్‌రెడ్డి, చెవిరెడ్డి పేర్లను మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. అలాగే, విరూపాక్ష జయచంద్రారెడ్డి సహా మరో 18 మంది ఇతరులపై ఉన్న కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేసింది.

More Telugu News