K Kavitha: గంగమ్మ ఒడిలో, కాశీ విశ్వనాథుడి సన్నిధిలో... అంటూ వారణాసి పర్యటనపై కవిత స్పందన

Kalvakuntla Kavitha tweets on Varanasi visit
  • వారణాసి పర్యటనకు వెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత
  • దశాశ్వమేధ ఘాట్ లో గంగమ్మకు హారతి
  • హనుమాన్ ఆలయంలో పూజలు
  • అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు పడవ ప్రయాణం
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇవాళ వారణాసి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కేసీఆర్ అర్ధాంగి శోభ, ఆయన కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారణాసి ఆధ్యాత్మిక పర్యటన సాగించారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద వారు గంగా నదికి పవిత్ర హారతి ఇచ్చారు. పురాతనమైన సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో పూజాదికాలు నిర్వహించారు.

 అంతేకాదు, ఇక్కడి అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు గంగా నదిలో పడవ ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. "గంగమ్మ ఒడిలో... కాశీ విశ్వనాథుడి సన్నిధిలో..." అంటూ కవిత ట్వీట్ చేశారు. కాగా, వారణాసి క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఆమె స్థానిక గైడ్ ను అడిగి తెలుసుకున్నారు.
K Kavitha
Shobha
Varanasi
KCR
Telangana

More Telugu News