Shruti Hassan: ప్రభాస్ సరసన శ్రుతిహాసన్.. అధికారిక ప్రకటన!

Shruti Hassan name announced officially for Salar movie
  • ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ 'సలార్'
  • హీరోయిన్ పాత్రకు శ్రుతిహాసన్ ఎంపిక
  • శ్రుతి జన్మదినం సందర్భంగా వెల్లడి    
శ్రుతిహాసన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా 'క్రాక్' సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ సరసన నటించే బిగ్ ఆఫర్ ను చేజిక్కించుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్' సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ ఫిక్స్ అయింది.

ఈ విషయాన్ని నేడు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నేడు శ్రుతిహాసన్ జన్మదినం కావడంతో ఈ వార్తను సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది.

'విష్ యూ హ్యాపీ బర్త్ డే శ్రుతిహాసన్.. మా సలార్ బృందంలో మీరు కూడా చేరుతున్నందుకు ఆనందంగా వుంది..' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఆమె ఫొటో సహా ట్వీట్ చేసింది. మొదట్లో ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు పలువురి పేర్లు వినిపించినప్పటికీ, గత కొన్ని రోజులుగా శ్రుతిహాసన్ ని ఎంపిక చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ వార్త అధికారికంగా వెల్లడి కావడంతో సస్పెన్న్ వీడింది.

ఇదిలావుంచితే, ఈ చిత్రం తొలిషెడ్యూలు షూటింగును రామగుండం కోల్ మైన్స్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పది రోజుల పాటు అక్కడ జరిగే షూటింగులో ప్రభాస్, ఫైటర్లపై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట.
Shruti Hassan
Prabhas
Prashanth Neel

More Telugu News