ఏపీ కరోనా అప్ డేట్: 111 కొత్త కేసులు, ఇద్దరి మృతి

27-01-2021 Wed 17:04
  • గత 24 గంటల్లో 33,808 కరోనా టెస్టులు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19 కేసులు
  • ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,369
AP Corona Update

ఏపీలో గత 24 గంటల్లో 33,808 కరోనా టెస్టులు నిర్వహించగా 111 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 5 కొత్త కేసులు వెలుగు చూశాయి.

అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,349 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,828 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,369 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటిదాకా 7,152 మంది కరోనాతో కన్నుమూశారు.