Anushka Shetty: హైదరాబాదులో 'షీ పాహి' కార్యక్రమంలో అనుష్క సందడి

Anushka attends Cyberabad police initiative
  • క్విక్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులోకి తెచ్చిన పోలీసులు
  • ఫిలిం నగర్ లో ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా అనుష్క
  • ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్ అంటూ వ్యాఖ్యలు
హైదరాబాదు ఫిలిం నగర్ లో 'షీ పాహి' పేరిట పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అందాల నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో అనుష్క సైబరాబాద్ డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ, ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్ అని కొనియాడారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో పోలీసులు ఎనలేని సేవలు అందించారని కితాబునిచ్చారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులు విధులు నిర్విర్తిస్తుండడం ఆనందదాయకం అని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక హిత కార్యక్రమానికి తనను పిలవడం పట్ల అనుష్క సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి 'షీ పాహి' అని నామకరణం చేయడం సబబుగా ఉందని, సమాజంలో పరస్పరం అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Anushka Shetty
She Pahi
Cyberabad
Hyderabad
Tollywood

More Telugu News