కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ పై బాలకృష్ణ స్పందన

26-01-2021 Tue 15:46
  • బసవతారకం ఆసుపత్రిలో రిపబ్లిక్ డే వేడుకలు
  • జెండా ఎగురవేసిన బాలకృష్ణ
  • మన వ్యాక్సిన్ విదేశాల్లోనూ ఉపయోగపడుతోందని వ్యాఖ్యలు
  • తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ దివ్యంగా సాగుతోందని కితాబు 
Balakrishna opines on Covaxin corona vaccine

హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశీయంగా రూపొందించిన కొవాగ్జిన్ పై స్పందించారు. మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇతర దేశాల్లోని ప్రజలకు ఉపయోగపడడం గర్వించాల్సిన విషయం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని కొనియాడారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా మృతి చెందినవారికి బాలయ్య నివాళులు అర్పించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయన బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధిత చిన్నారులకు పండ్లు అందజేశారు.