మదనపల్లె దారుణ ఘటనలో తండ్రి ఏ1, తల్లి ఏ2

26-01-2021 Tue 13:15
  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన
  • కుమార్తెలను చంపుకున్న తల్లిదండ్రులు
  • మూఢభక్తితో ఘోరకృత్యం
  • నిందితులను పీఎస్ కు తరలించిన పోలీసులు
  • ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం
Police files case on Madanapalle couple who killed their daughters

చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్లను క్షుద్రశక్తులు, మూఢనమ్మకాలపై పిచ్చితో దారుణంగా అంతమొందించిన పద్మజ, పురుషోత్తంనాయుడులను పోలీసులు మదనపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారిద్దరినీ పోలీసులు వారి నివాసంలోనే ఉంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ బతికివస్తారంటూ తమ కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యలను ఆ మూఢ దంపతులు చంపిన వైనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

కాగా, హత్యానేరం మోపుతూ కేసు నమోదు చేసిన పోలీసులు పురుషోత్తంనాయుడును ఏ1గా, పద్మజను ఏ2గా పేర్కొన్నారు. ఈ జంట హత్యకేసు నిందితులను పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఎంతో ఉన్నత విద్యావంతులైన పురుషోత్తంనాయుడు, పద్మజ ఇంతటి ఘోరానికి ఒడిగట్టారన్న విషయం విస్మయం కలిగిస్తోంది.