Youtube star: పద్మనాభస్వామి దర్శనానికి వెళ్లిన యూట్యూబ్ నటిపై కారు డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

 Car driver indecent behavior on YouTube actress
  • గత నెల 13న కేరళకు..
  • తన డ్రైవర్‌కు డ్రగ్స్ అలవాటు ఉందన్న నటి
  • అవి లేకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌కు చెందిన యూట్యూబ్ నటి పట్ల ఆమె డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం నటి (32) ఈ నెల 13న పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు కేరళ వెళ్లింది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న ఆమె డ్రైవర్ షేక్ ఇబ్రహీం అవి తీసుకోకపోవడంతో నటితో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం నగరానికి చేరుకున్న తర్వాత బాధిత నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Youtube star
Kerala
Car Driver
Crime News

More Telugu News