Rahul Gandhi: నేడు కరూర్ జిల్లాలో రాహుల్ పర్యటన.. సిద్ధమవుతున్న మటన్ బిర్యానీ, నాటుకోడి కూర

Congress leader Rahul Gandhi lunch with Mutton Biryani
  • మురుగన్ విలాస్ హోటల్‌లో లంచ్
  • ఆహార భద్రత అధికారుల సమక్షంలో వడ్డింపు
  • రాహుల్‌తో కలిసి 17 మందికి మాత్రమే అనుమతి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తమిళనాడులోని కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాంసాహార విందు ఇవ్వడానికి నేతలు సిద్ధమవుతున్నారు. కరూర్-మధురై జాతీయ రహదారిపై ఉన్న మురుగన్ విలాస్ హోటల్‌లో నేటి మధ్యాహ్నం రాహుల్ గాంధీ సహా వందమంది భోజనం చేయనున్నారు.

ఇందుకోసం కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆహార భద్రత శాఖ అధికారుల సమక్షంలో రాహుల్‌కు వీటిని వడ్డిస్తారు. రాహుల్‌ గాంధీతోపాటు 17 మంది మాత్రమే విందులో పాల్గొంటారని, మిగిలిన వారు హోటల్ బయట భోజనం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.  

రాహుల్ మెనూ ఇలా..

* మటన్ బిర్యానీ
* నాటుకోడి కూర
* నాటుకోడి గుడ్ల గ్రేవీ
* అన్నం
* కొబ్బరి కలపని చికెన్ కూర
* మిరియాల రసం
* పెరుగు
*నాటు చక్కెర పప్పు పాయసం
Rahul Gandhi
Congress
Murugan Vilas Hotel
Lunch

More Telugu News