సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోమారు ఫిర్యాదు

23-01-2021 Sat 07:36
  • పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ గతేడాది ఫిర్యాదు
  • కేసును వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారంటూ తాజా ఆరోపణ
  • జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు
Actress Sri Sudha again complaint against shyam k naidu

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై సినీనటి శ్రీసుధ మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసున్న తర్వాత ఇప్పుడు కాదంటున్నాడంటూ గతేడాది శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ మరోమారు ఎస్సార్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు.

సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మాదాపూర్‌లోని తన నివాసానికి పిలిపించాడని, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నా తనను దూషించాడని పేర్కొన్న శ్రీసుధ.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీసుధ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేయనున్నట్టు చెప్పారు.