Gram Panchayat Elections: ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లినా నిమ్మగడ్డను కలవకుండానే వెనుదిరిగిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు!

Panchayatraj officials goes to SEC office
  • ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సిద్ధం
  • పంచాయతీ అధికారుల సమావేశం ఏర్పాటు
  • గైర్హాజరైన అధికారులు
  • మెమో జారీ చేసిన ఎస్ఈసీ
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వివాదం తీవ్రరూపు దాల్చుతోంది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ సాయంత్రం పంచాయతీరాజ్ అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అని చెప్పినా, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ హాజరు కాలేదు.

దాంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మెమో జారీ చేశారు. అనంతరం, ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ అక్కడే ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలవకుండానే తిరిగి వెళ్లారు. ప్రభుత్వం తరఫున లేఖను నిమ్మగడ్డ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ కు అందజేసి వెళ్లిపోయారు.
Gram Panchayat Elections
SEC
Nimmagadda Ramesh Kumar
YSRCP
Andhra Pradesh

More Telugu News