Singapore: విమానాన్ని ఢీకొట్టబోయిన యూఎఫ్‌వో?.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో చూడండి!

  • ఈ నెల 17న జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘటన
  • విమానం ల్యాండ్ అవుతుండగా దూసుకెళ్లిన ఎగిరే పళ్లెం
  • రాడార్‌లో కనిపించకపోవడంతో బలపడుతున్న అనుమానాలు
Singapore Airlines Passenger Films Near Collision with UFO from Flight

యూఎఫ్‌వో/ఎగిరే పళ్లాలు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)లు ఉన్నాయా? శాస్త్రవేత్తలను దశాబ్దాల తరబడి వేధిస్తున్న ప్రశ్న ఇది. యూఎఫ్‌వోలు ఉన్నాయని కానీ, లేవని కానీ కచ్చితంగా ఎవరూ తేల్చి చెప్పలేకపోతున్నారు. అయితే, ఆ వార్తలకు మాత్రం తెరపడడం లేదు. తాజాగా, మరోమారు అలాంటి వార్తే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే, ఈసారి అది విమానాన్ని ఢీకొట్టబోయిందని, క్షణకాలంలో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 17 ఉదయం 7.50 గంటల సమయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానమొకటి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోంది. అంతలో అకస్మాత్తుగా ఓ తెల్లని వస్తువు (యూఎఫ్‌వో) ఒకటి విమానం వైపుగా దూసుకొచ్చింది.

అది విమానం కుడివైపు రెక్క కింది నుంచి దూసుకుపోయింది. దాదాపు ఢీకొట్టినంత పనిచేసింది. ల్యాండింగును వీడియో తీస్తున్న వ్యక్తి మొబైల్‌లో ఇది రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎగిరే పళ్లెం రాడార్‌పై కనిపించకపోవడంతో అది కచ్చితంగా డ్రోన్, లేదంటే పక్షి కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, అది యూఫ్‌వోనే అయి ఉంటుందని వారి ఉద్దేశం.

More Telugu News