రిష‌భ్ పంత్‌ను 'స్పైడర్ పంత్' అంటూ ఆకాశానికెత్తేసిన ఐసీసీ!

21-01-2021 Thu 09:31
  • బ్రిస్బేన్ లో ఇటీవ‌ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌
  • టీమిండియాకు విజయం అందించిన పంత్
  • ‘స్పైడర్‌ మ్యాన్‌’ వేష‌ధార‌ణ‌లో పంత్ ఉన్న ఫొటో పోస్ట్
  • స్పైడర్‌-పంత్.. స్పైడర్- పంత్..' అంటూ కొత్తగా లిరిక్  
icc posts pant pic

బ్రిస్బేన్ లో ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్ లో చివ‌రి టెస్టు చివ‌రి రోజు ఆట‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్ ‌పంత్ అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టును గెలిపించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌నను ఐసీసీ ఆకాశానికెత్తేసింది. ‘స్పైడర్‌ మ్యాన్‌’ వేష‌ధార‌ణ‌లో ఉన్న ఆయ‌న గ్రాఫిక్స్ ఫొటోను ఐసీసీ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ఆయ‌న‌ను ‘స్పైడర్‌ పంత్‌’గా పేర్కొంది.

ఇటీవ‌ల‌ ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్‌ టిమ్‌పైన్‌(27) బ్యాటింగ్‌ చేస్తున్న స‌మ‌యంలో రిష‌భ్ పంత్  కీపింగ్‌ చేస్తున్నాడు. ఆ స‌మ‌యంలో పంత్‌ ‘స్పైడర్‌ మ్యాన్‌’ సినిమా లిరిక్‌ను పాడుకున్న నేప‌థ్యంలో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  అందుకే ‘స్పైడర్‌ మ్యాన్‌’ లా పంత్‌ ఫొటోను పోస్ట్ చేసింది.  

'స్పైడర్‌-పంత్.. స్పైడర్- పంత్..' అంటూ ఆ సినిమా లిరిక్‌ను పంత్ కు అన్వయిస్తూ రాసింది. స్పైడర్‌ ఏం చేయగలదో పంత్‌ అది చేస్తాడని, ఆయ‌న‌ సిక్సులు కొట్టగలడని, క్యాచ్‌లు పట్టగలడని పేర్కొంది. భార‌త జ‌ట్టుకు ఆయ‌న విజయాన్ని అందించాడ‌ని తెలిపింది. కాగా, చివ‌రి టెస్టులో పంత్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.  ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో 13వ ర్యాంక్‌కు ఎగ‌బాకాడు.