Ameerpet: మార్గమధ్యంలో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు.. 15 నిమిషాలపాటు రాకపోకలకు అంతరాయం

Metro Rail in Hyderabad suddenly stopped on tracks
  • అమీర్‌పేట నుంచి నాగోలువైపు వెళ్తుండగా ఘటన
  • ఇబ్బందిపడిన ప్రయాణికులు
  • మరో రైలును పంపి ఆగిపోయిన రైలు తరలింపు
హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలకు మరోమారు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట నుంచి నాగోలు వైపు వెళ్తున్న రైలు సాంకేతిక సమస్యతో మార్గమధ్యంలో ఆగిపోయింది. 15 నిమిషాలపాటు పట్టాలపైనే నిలిచిపోయింది. రైలు అర్థాంతరంగా ఆగిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

విషయం తెలిసిన అధికారులు వెంటనే మరో రైలును పంపించి, ఆగిపోయిన రైలులోని ప్రయాణికులను దింపివేసి దానిని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, హైటెక్ సిటీ నుంచి వచ్చిన రైలును జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లో నిలిపివేసి ప్రయాణికులను దింపివేశారు. మెట్రోలో సాంకేతిక సమస్యలు ఏర్పడి నిలిచిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.
Ameerpet
Hyderabad metro Rail
Nagole
Hyderabad

More Telugu News