పరిటాల శ్రీరామ్ తనయుడికి నామకరణం.. ఏం పేరు పెట్టారో తెలుసా?

20-01-2021 Wed 15:52
  • కుమారుడికి తన తండ్రి పేరును పెట్టుకున్న శ్రీరాం
  • ఘనంగా జరిగిన నామకరణోత్సవం
  • కొడుకుని అందరూ ఆశీర్వదించాలని కోరిన శ్రీరాం
Paritala Sriram son name function

టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ కు ఇటీవల కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ తనయుడి నామకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తన కుమారుడికి తన తండ్రి పరిటాల రవీంద్ర పేరును శ్రీరామ్ పెట్టుకున్నారు. తన కుమారుడికి రవీంద్ర అనే పేరు పెడుతున్న తరుణంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

 నవంబర్ 6న పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు కుమారుడు పుట్టాడు. రవి మళ్లీ పుట్టాడంటూ పరిటాల అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇక తన కుమారుడికి పరిటాల రవీంద్ర అనే పేరు పెట్టామని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందని శ్రీరామ్ ట్వీట్ చేశారు. దివంగత పరిటాల రవి పేరుకు సార్థకత చేకూర్చాలని ఆకాంక్షిస్తూ బిడ్డకు ఆశీస్సులు అందించాలని కోరుతున్నానని చెప్పారు.