దేవినేని ఉమపై భౌతిక దాడులకు దిగుతానన్న కొడాలి నానిపై చర్యలు ఉండవా?: చంద్రబాబు

19-01-2021 Tue 15:11
  • గొల్లపూడిలో దేవినేని ఉమ అరెస్ట్
  • ప్రజల పక్షాన నిలిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం
  • కొడాలి నానిపైనా వ్యాఖ్యలు
  • మంత్రి బరితెగించాడని విమర్శలు
Chandrababu responds after Devineni Uma arrest

గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన దేవినేని ఉమను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు అండగా నిలిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. దేవినేని ఉమపై భౌతికదాడికి దిగుతానన్న కొడాలి నానిపై చర్యలు ఉండవా? అని నిలదీశారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మంత్రి బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లా ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని క్రూర స్వభావి జగన్ అని విమర్శించారు. గొల్లపూడిలో అరెస్ట్ చేసిన ఉమతో పాటు ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.