హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్.. ఫొటోలు వైరల్!

19-01-2021 Tue 13:32
  • ఓ ఇంటర్య్వూలో స్ప‌ష్టం చేసిన‌ బోనీ కపూర్‌
  • ఇటీవ‌ల‌ ఖుషీ ఫొటో షూట్
  • ఇప్ప‌టికే లండన్‌లోని ఫిలిం స్కూల్‌లో శిక్ష‌ణ  
khushi to enter bollywood

దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ త్వరలో కథానాయికగా సినీ రంగంలోకి ప్ర‌వేశించ‌నుంది. ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఈ విష‌యాన్ని నిర్ధారించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్‌ మాట్లాడుతూ..  త‌న చిన్న కూతురిని న‌టిగా సినీరంగానికి ప‌రిచ‌యం చేయడానికి త‌న‌ దగ్గర అన్ని వనరులు ఉన్న‌ప్ప‌టికీ ఆమెను మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాద‌ని తెలిపారు.
     
ఎందుకంటే నిర్మాతగా త‌నకు, నటిగా ఖుషీకి ఇది మంచిది కాదని తెలిపారు. త‌న కూతురు ఖుషీ తన సొంతంగా ఎదగాలని తాను కోరుకుంటున్నానని, అందుకే ఆమెను తాను ప‌రిచ‌యం చేయ‌బోన‌ని చెప్పారు. కాగా, ఇటీవల తాను ఫొటో షూట్ లో పాల్గొన్న ఫొటోలను సామాజిక మాధ్య‌మాల్లో ఖుషీ పోస్ట్ చేసింది.  
      
ఇప్పటి వరకు ప్రైవసీలో పెట్టుకున్న త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను ఆమె పబ్లిక్ లోకి మార్చింది. ఆమె లండన్‌లోని ఫిలిం స్కూల్‌లో న‌ట‌న‌లో శిక్ష‌ణ కూడా తీసుకుంది. త‌న చెల్లి సినిమాల్లోకి వ‌స్తుంద‌ని  జాన్వీ క‌పూర్ కూడా ఇటీవ‌ల తెలిపింది.