విక్ట‌రీ వెంక‌టేశ్‌తో పాటు ప‌లువురికి మీనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్!

18-01-2021 Mon 13:18
  • చెన్నైలోని  తన నివాసంలో మొక్కలు నాటిన మీనా
  • సుదీప్,  కీర్తి సురేష్‌కు ఛాలెంజ్
  • రోజా, టీవీ 9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లికి థ్యాంక్స్
meena accepts green india challenge

టీఆర్ఎస్  రాజ్య‌స‌భ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్య‌క్ర‌మం మ‌రింత‌ విస్తృతంగా కొనసాగేలా ప్ర‌చారం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇందులో తాజాగా సినీ న‌టి మీనా కూడా పాల్గొన్నారు.

చెన్నైలోని సైదాపేట్‌లో తన నివాసంలో మొక్కలు నాటారు. తెలుగు హీరో వెంకటేశ్, కన్నడ హీరో సుదీప్, మలయాళ హీరోయిన్ మంజు వరియర్, హీరోయిన్ కీర్తి సురేష్‌కు ఆమె ఛాలెంజ్ విసిరి, మొక్కలు నాటాలని చెప్పారు. తాను మొక్క‌లు నాటేలా చేసిన ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే, సినీన‌టి రోజా, టీవీ 9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి, టీవీ9 తెలుగుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆమెకు ఎంపీ సంతోష్ కుమార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.