తమిళ హీరో సరసన తమన్నా!

18-01-2021 Mon 12:50
  • సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుశ్ 
  • గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందే సినిమా 
  • ధనుశ్ తో తమన్నాకు ఇది మూడో చిత్రం   
Tamanna signs a new film opposite Dhanush

కథానాయికల మధ్య ప్రస్తుతం వున్న కాంపిటీషన్ నేపథ్యంలో ఏదైనా సినిమాలో అవకాశం రావడమే గొప్ప అనుకుంటున్నారు సీనియర్ హీరోయిన్లు. అందుకే, ఎటువంటి అవకాశం వచ్చినా కాదనకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. అదే కోవలో తమన్నా కూడా పయనిస్తోంది. ఓపక్క కొత్తమ్మాయిల రాకతో సీనియర్లకు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ చిన్నది జాగ్రత్త పడుతూ వచ్చిన సినిమాకి వెంటనే ఎస్ చెప్పేస్తోంది.

ఈ క్రమంలో తమిళం నుంచి వచ్చిన ఓ ఆఫర్ కు అమ్మడు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ధనుశ్ హీరోగా అతని సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పేరు 'నాన్ వారువేన్'. గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు చిత్ర బృందం తమన్నాను సంప్రదించింది. దాంతో ఈ చిన్నది ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

గతంలో ధనుశ్, తమన్నా జంటగా 'పడిక్కాదవన్', 'వేంగై' వంటి రెండు చిత్రాలలో నటించారు. మళ్లీ కొనేళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ ఇప్పుడు 'నాన్ వారువేన్' సినిమాలో జంటగా నటిస్తున్నారు.