Star Maa: ప్రెస్ నోట్: 'స్టార్‌ మా' లో లేడీ హీరో రుద్రమ!!

  • ధారావాహికగా రానున్న  వీరనారి రుద్రమదేవి విజయగాధ
  • సీరియల్‌ కోసం పనిచేస్తున్న జాతీయ స్థాయి బృందం
  • 18 జనవరి 21 నుంచి రాత్రి 9 గంటలకు 'స్టార్‌ మా' లో 

Witness Rani Rudrama Devis Journey on Star Maa

ప్రెస్ నోట్: తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాల అధ్యాయంగా చెప్పదగ్గ “రుద్రమదేవి” ని తెలుగువారి అభిమాన ఛానల్‌ 'స్టార్‌ మా' ఇప్పుడు ఇంటింటికీ ఓ ప్రతిష్టాత్మకమైన ధారావాహికగా, ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలతో అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
 
కథల ఎంపికలో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేసి విలక్షణమైన కథల్ని అందించే 'స్టార్‌ మా' ఇప్పుడు సాహసోపేతమైన ఈ తెలుగింటి ఆడపడుచు వీరోచిత పోరాటగాధని సమర్పిస్తోంది. బడ్జెట్ విషయంలో, ప్రమాణాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు లేకుండా ఒక అద్భుతాన్ని తమ ప్రియతమ ప్రేక్షకులకు కానుకగా అందిస్తోంది.
 
తెలంగాణ నేలపైన దశాబ్ధాల క్రితం జరిగినా తరతరాలకు స్పూర్తిగా నిలిచిన ఈ వీరనారి విజయగాధ అందించే స్ఫూర్తి ఓ బుల్లితెర అద్భుతంలా రూపుదిద్దుకుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన “రుద్రమదేవి” ప్రత్యేకతలు ఎన్నో..ఎన్నైన్నో !!
 
తెలుగువారు కనీవినీ ఎరుగని స్థాయిలో బుల్లితెరకు వన్నె తెచ్చేలా జాతీయ స్థాయి బృందం ఈ సీరియల్‌ కోసం పనిచేస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ “రుద్రమదేవి” 'స్టార్‌ మా' లో 18 జనవరి 21 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
 
ఎప్పటికీ గుర్తుండే ఈ “రుద్రమదేవి” కథ... ఎప్పటికీ గుర్తుండే ధారావాహికలా తెలుగిళ్లలో వినోదానికి ఓ సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది. 'స్టార్‌ మా' సగర్వంగా సమర్పిస్తోంది.
 
“రుద్రమదేవి” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w 
 
Press release by: Indian Clicks, LLC

More Telugu News