అఖిలప్రియకు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ!

18-01-2021 Mon 08:38
  • అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వండి
  • వాదనలు వినిపించనున్న అఖిల తరఫు న్యాయవాదులు
  • వ్యతిరేకించనున్న ప్రాసిక్యూషన్
Court Hearing on Akhilapriya Bail Today

హైదరాబాద్, బోయిన్ పల్లిలో వెలుగుచూసిన కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై నేడు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. ఆమె అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదించనున్నారు.

ఇదే సమయంలో కేసులో మరిన్ని చిక్కుముడులను విడదీయాల్సి వుందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే, సాక్షులను తారుమారు చేయవచ్చని ప్రాసిక్యూషన్ వాదించనుంది. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు బెయిల్ లభిస్తుందా? అన్న విషయమై సస్పెన్స్ నెలకొంది.