Mushrooms: మనిషి రక్తంలో పెరిగిన పుట్టగొడుగులు... అసలేం జరిగిందంటే...!

  • బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తి
  • పుట్టగొడుగులు డిజార్డర్ ను తగ్గిస్తాయని నమ్మిన వ్యక్తి
  • పుట్టగొడుగల టీని రక్తనాళాల్లోకి ఎక్కించుకున్న వైనం
  • తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలు
Man takes mushrooms tea into veins

సాధారణంగా పుట్టగొడుగులు మట్టిలో పెరుగుతుంటాయి. వీటిలో అనేక రకాలు ఉంటాయి. కొన్ని విషపూరితమైనవి కాగా, కొన్నింటిని ఆహార పదార్ధంగా ఉపయోగించుకునే వీలుంది. అయితే అమెరికాలోని ఓ 30 ఏళ్ల వ్యక్తి పుట్టగొడుగులతో తయారు చేసిన కషాయాన్ని రక్తంలో ఎక్కించుకున్నాడు. ఆపై ఆసుపత్రి పాలయ్యాడు.

ఆ వ్యక్తి బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడు. ఈ తరహా మానసిక వ్యాధి పుట్టగొడుగుల్లో ఉండే సిలోసైబిన్ పదార్థంతో నయమవుతుందని తెలుసుకున్నాడు. దాంతో తాను రెగ్యులర్ గా వాడే మందులను ఆపేసి, సైకీడెలిక్ పుట్టగొడగులు లేక మ్యాజిక్ మష్రూమ్స్ గా పిలిచే పుట్టగొడుగులతో టీ తయారు చేసి దాన్ని తన రక్తనాళాల్లోకి ఎక్కించుకున్నాడు.

అయితే, కొన్నిరోజులకు అతడికి డయేరియాతో పాటు రక్తపు వాంతులు కలిగాయి. అతని చర్మం కూడా పసుపురంగులోకి మారడం ప్రారంభించింది. దాంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి అవయవాల పనితీరు క్షీణిస్తుండడంతో ఐసీయూలో చేర్చారు. వైద్య పరీక్షలు చేయగా అతడి రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. అతడు పుట్టగొడుగుల టీని రక్తనాళాల్లోకి ఎక్కించుకోవడంతో, ఇప్పుడా పుట్టగొడుగులు అతడి రక్తంలో పెరుగుతున్నట్టు వెల్లడైంది. పాపం, ఆ వ్యక్తి ఏడు రోజుల పాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. మొత్తమ్మీద 22 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు.

More Telugu News