Udhav Thackeray: కర్ణాటకలో ఉన్న ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేస్తాం: సీఎం ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు

  • కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలు
  • సుదీర్ఘకాలంగా పోరాటం
  • 1956 ఘర్షణలో పలువురి మృతి
  • నాటి నుంచి జనవరి 17న సంస్మరణ దినం
CM Udhav Thackeray says they will merge Marathi speaking places of Karnataka into Maharashtra

కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. మహా సీఎం చేసిన ఈ వ్యాఖ్యల వెనుక చాలా చరిత్ర ఉంది.

ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఈ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ ఏలుబడి కింద ఉండేవి. అయితే ఆ ప్రాంతాలు మహారాష్ట్రకు చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తోంది. 1956 జనవరి 17న జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి జనవరి 17న మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నారు.

ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాకరే కార్యాలయం ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు తాము వాగ్ధానం చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.

More Telugu News