Mahesh Manjrekar: కారుకు సొట్టలు పడడంతో డ్రైవర్ పై చేయిచేసుకున్న నటుడు

 Mahesh Manjrekar reportedly slapped his car driver
  • నటుడు మహేశ్ మంజ్రేకర్ పై కేసు నమోదు
  • కారులో పుణే నుంచి షోలాపూర్ వెళుతుండగా బ్రేక్ వేసిన డ్రైవర్
  • వెనుక నుంచి ఢీకొట్టిన మరో కారు
  • డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్ మంజ్రేకర్
  • కొట్టడంతో పాటు బూతులు తిట్టిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్
బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన మహేశ్ మంజ్రేకర్ చిక్కుల్లో పడ్డారు. తన కారు డ్రైవర్ ను కొట్టారంటూ ఆయనపై కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే... మహేశ్ మంజ్రేకర్ శుక్రవారం రాత్రి కారులో పుణే నుంచి షోలాపూర్ వెళుతున్నారు. ఆ సమయంలో కారును కైలాశ్ సత్పుతే అనే డ్రైవరు నడుపుతున్నాడు. మార్గమధ్యంలో ఒక చోట సడెన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన మరో కారు మహేశ్ మంజ్రేకర్ కారును ఢీకొట్టింది. దాంతో కారుకు సొట్టలు పడ్డాయి.

ఇది చూసిన మహేశ్ మంజ్రేకర్ పట్టరాని ఆగ్రహంతో డ్రైవర్ కైలాశ్ సత్పుతేపై చేయిచేసుకున్నారు. పైగా బండబూతులు తిట్టారు. దాంతో ఆ డ్రైవరు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మహేశ్ మంజ్రేకర్ పై ఫిర్యాదు చేశారు. డ్రైవరు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేశ్ మంజ్రేకర్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెలుగులో ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్ వంటి చిత్రాల్లో నటించారు.
Mahesh Manjrekar
Car Driver
Slap
Police
Maharashtra
Bollywood
Tollywood

More Telugu News