Team India: భారత్-ఆస్ట్రేలియా టెస్టును అడ్డుకున్న వరుణుడు

  • తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా
  • 44 పరుగులతో దూకుడుగా ఆడి ఔటైన రోహిత్
  • భారత్ 62 పరుగుల వద్ద ఉండగా అడ్డుకున్న వర్షం
Rain stopped India and Australia test match

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా భారత్ బ్యాటింగ్ ఆగిపోయింది. ఆట ఆగిపోయే సమయానికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 62 పరుగులుగా ఉంది. క్రీజులో 8 పరుగులతో ఛటేశ్వర్ పుజారా, 2 పరుగులతో అజింక్య రహానే ఉన్నారు. అంతకు ముందు శుభ్ మన్ గిల్ (7), రోహిత్ శర్మ (44) ఔట్ అయ్యారు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత్ బ్యాటింగ్ ఆరంభించిన కాసేపటికే గిల్ వికెట్ ను భారత్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న స్మిత్ చేతికి గిల్ చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆడాడు. 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. పుజారాతో కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించాడు. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరైన తరుణంలో ఔట్ అయ్యాడు. లైయన్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టేందుకు యత్నించి మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రహానే క్రీజులోకి వచ్చాడు. పుజారా, రహానె జాగ్రత్తగా ఆడుతున్న సమయంలో వర్షం అడ్డంకిగా మారింది.

More Telugu News