తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు.. అప్ డేట్స్!

16-01-2021 Sat 11:14
  • గత 24 గంటల్లో కొత్తగా 249 కేసుల నమోదు
  • 2,91,367కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • ప్రస్తుతం రాష్ట్రంలో 4,273 యాక్టివ్ కేసులు
Telangana registers 249 new Corona cases

ఈరోజు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ క్యార్యక్రమం ప్రారంభమైంది. తొలి విడతలో ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ కి వ్యాక్సిన్ వేయనున్నారు. మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో ఒకరు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,367కి పెరిగింది. మొత్తం 1,575 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ కేసులలో 2,381 మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు.