సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

16-01-2021 Sat 07:29
  • పది కిలోలు పెరిగిన కథానాయిక 
  • బాలీవుడ్ లోకి విజయ్ 'మాస్టర్'
  • చివరి షెడ్యూల్ లో నాగశౌర్య 'లక్ష్య'  
Keerti Suresh put on weight for her latest movie

*  ఆమధ్య బాగా సన్నబడిన కథానాయిక కీర్తి సురేశ్ ఇప్పుడు 10 కిలోల బరువు పెరిగిందట. మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా కోసం ఈ చిన్నది ఇలా బరువు పెరిగినట్టు చెబుతున్నారు. తాజాగా ఆమె దిగిన ఫొటోలలో కీర్తి బరువు పెరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది.  
*  ప్రముఖ తమిళ నటుడు విజయ్ హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన 'మాస్టర్' చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం మొదటి రోజు 25 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇదిలావుంచితే, ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు ఎండెమాల్ షైన్, స్థూడియో వన్ కలసి సంయుక్తంగా దీనిని హిందీలో రీమేక్ చేస్తాయని తెలుస్తోంది.    
*  యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడుగా నటిస్తున్న 20వ చిత్రం 'లక్ష్య' చివరి షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి సంక్రాంతి సందర్భంగా నిన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.