ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్' రేపే ప్రారంభం
- మూడు సినిమాలు చేస్తున్న ప్రభాస్
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'
- రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం
హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగును రేపు కనుమ రోజున ఉదయం 11 గంటలకు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ ముహూర్తం విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో యశ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని తెలిపారు.
యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందే 'సలార్'లో నటించే కథానాయిక ఎవరన్నది ఇంకా వెల్లడికాలేదు. ఆ విషయంతో పాటు ఇతర నటీనటుల వివరాలను కూడా రేపు ప్రకటించే అవకాశం వుంది. ఇదిలావుంచితే, ప్రభాస్ నటించనున్న మరో రెండు సినిమాల షూటింగులు కూడా త్వరలోనే మొదలవుతాయని సమాచారం.