కూకట్ పల్లిలో కంపించిన భూమి.. పరుగులు పెట్టిన జనాలు

13-01-2021 Wed 13:54
  • స్థానిక ఆస్బెస్టాస్ కాలనీలో ప్రకంపనలు
  • ఈ ఉదయం 9.30 గంటల సమయంలో ప్రకంపనలు
  • భయాందోళనలకు గురైన జనాలు
Earth quake in Kukatpalli

హైదరాబాదులో భూప్రకంపనలు అలజడి రేపుతున్నాయి. ఇటీవల బోరబండ ప్రాంతంలో ప్రకంపనలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. తాజాగా హైదరాబాద్ మరోసారి ప్రకంపనలతో ఉలిక్కి పడింది. ఈసారి కూకట్ పల్లి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. కూకట్ పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఈ ఉదయం 9.30 గంటల సమయంలో భూమి కంపించింది. రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. భూమి లోపల నుంచి భారీ శబ్దాలు రావడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. శబ్దాలు ఆగిపోయిన తర్వాత కూడా చాలా సేపు రోడ్ల మీదే ఉన్నారు.