సోనూ సూద్ పాత నేరస్తుడే... ముంబై హైకోర్టుకు నివేదిక!

13-01-2021 Wed 08:56
  • హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదు
  • అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు
  • కోర్టుకు తెలిపిన బీఎంసీ
Sonu Sood is Old Criminal says Mumbai Report

లాక్ డౌన్ కాలంలో ఎంతో మందిని ఆదుకున్నారని పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్, గతంలో నేరాలకు అలవాటు పడిన వ్యక్తని బాంబే హైకోర్టుకు ముంబయి నగరపాలక సంస్థ సంచలన నివేదికను అందించింది. నగర పరిధిలోని జుహూ ప్రాంతంలో సోనూ సూద్ నిర్మించుకున్న అనధికార కట్టడాలను తాము రెండు సార్లు కూల్చి వేశామని, హెచ్చరించినా, ఆయన పద్ధతిని మార్చుకోలేదని తన వివేదికలో వెల్లడించింది.

ఇటీవల సోనూ సూద్ హైకోర్టులో ఓ పిటిషన్ వేయగా, దానికి సమాధానం ఇవ్వాలని నగరపాలక సంస్థను హైకోర్టు ఆదేశించింది. దీనికి సమాధానంగా, అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. సోనూ గతంలో నేరాలు చేసిన వ్యక్తేనని స్పష్టం చేశారు.